ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు, దరఖాస్తు విధానం, వ్యవసాయ సమాచారం — సులభమైన తెలుగులో.

అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ 2026: ₹7,000 జమ అయ్యిందా?
ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధులను 30 అక్టోబర్ 2026న విడుదలయ్యాయి. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా మొత్తం ₹7,000 జమ అవుతుంది. మీ ఖాతాలో డబ్బు పడిందా లేదా అనేది అధికారిక పోర్టల్‌లో కొన్ని నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. నిధులు విడుదలైన రోజే అందరి ఖాతాల్లో డబ్బు కనిపించకపోవచ్చు. బ్యాంక్‌ను బట్టి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కనిపించకపోతే కంగారు పడకండి. అన్నదాత సుఖీభవ అంటే ఏమిటి? అన్నదాత సుఖీభవ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకం. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ...

MPTC, ZPTC, Ward Councillor, Corporator, Chairperson, Mayor, MPP, ZP Chairman, MLA, MP అంటే ఎవరు? గ్రామం నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికల వ్యవస్థ
ఎన్నికల సమయంలో MPTC, ZPTC, MPP, ZP Chairman, MLA, MP వంటి పదాలు తరచుగా వినిపిస్తాయి. కానీ ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు, ఎవరి పరిధి ఎంత, ఎవరు ఏ స్థాయిలో పని చేస్తారో చాలామందికి స్పష్టంగా ఉండదు. ఈ ఆర్టికల్‌లో గ్రామం, మండలం, జిల్లా, పట్టణం, రాష్ట్రం, దేశం — అన్ని స్థాయిల్లోని ఎన్నికైన ప్రతినిధుల గురించి సులభంగా తెలుసుకోండి. ఈ ఆర్టికల్ విద్యాసంబంధమైన సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వదు, ఎవరికి ఓటు వేయాలో సూచించదు. ఎన్నికల నియమాలు, సీట్ల సంఖ్య, reservations రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు ఎన్నికల సంఘం ప్రకటనల ప్రకారం మారవచ్చు. 🔔 అప్‌డేట్స్ మిస్ అవ్వకండి — ఫాలో అవ్వండి ...

PRC అంటే ఏమిటి? PRC తో జీతం ఎలా లెక్కిస్తారు? (12th PRC అంచనా కాలిక్యులేటర్)
PRC అంటే Pay Revision Commission, అంటే వేతన సవరణ కమిషన్. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు ఎలా ఉండాలో అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫారసులు ఇచ్చే కమిషన్ ఇది. మన రాష్ట్రంలో సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి పే సవరణ జరుగుతుంది. ఎందుకు అవసరం అంటే, ధరలు ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టు ప్రభుత్వం DA (Dearness Allowance) ఇస్తుంది. కొన్నేళ్లకు ఈ DA శాతం చాలా పెరిగిపోతుంది. అప్పుడు DA ని basic pay లో కలిపేసి (దీన్నే merge చేయడం అంటారు), దానికి పైన కొంత fitment ఇచ్చి, కొత్త pay scales తయారు చేస్తారు. PRC చేసే ముఖ్యమైన పని ఇదే. ...

SBI PM-KUSUM Component-A లోన్: 70% వరకు రుణం, అర్హతలు, పత్రాలు, ప్రస్తుత స్థితి
PM-KUSUM Component-A అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వ PM-KUSUM పథకంలోని ఒక భాగం ఇది. ఇందులో రైతులు, రైతుల సమూహాలు, FPOలు, సహకార సంఘాలు వంటి అర్హ సంస్థలు 500 kW నుంచి 2 MW వరకు సామర్థ్యం గల గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను విద్యుత్ పంపిణీ సంస్థకు (DISCOM) అమ్మవచ్చు. ఈ ప్రాజెక్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) టర్మ్ లోన్ ఇస్తుంది. చాలామంది దీన్ని “సోలార్ పంపు లోన్” అనుకుంటారు, కానీ అది వేరు. ఈ పోస్టులో SBI వెబ్‌సైట్ మరియు MNRE సమాచారం ఆధారంగా రుణ వివరాలు, అర్హతలు, పత్రాలు, దరఖాస్తు విధానం సరళంగా వివరించాం. ...

మనమిత్ర WhatsApp ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపు – Mana Mitra Electricity Bill Payment (APEPDCL, APSPDCL, APCPDCL)
కరెంట్ బిల్లు కట్టడానికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఏ యాప్ లేదా వెబ్‌సైట్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ WhatsApp Mana Mitra ద్వారా మీ సర్వీస్ నంబర్‌తో WhatsApp లోనే బిల్లు చెల్లించవచ్చు. ఈ పోస్టులో స్టెప్ బై స్టెప్ విధానం, చెల్లింపు తర్వాత వచ్చే రసీదు మరియు SMS వివరాలు, చాట్ స్లోగా స్పందించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. క్లుప్తంగా WhatsApp నంబర్: 9552300009 (అధికారిక Mana Mitra నంబర్) కావాల్సింది: మీ కరెంట్ సర్వీస్ నంబర్ మరియు UPI యాప్ Mana Mitra అన్ని డిస్కమ్‌లకు (APEPDCL, APSPDCL, APCPDCL) పనిచేస్తుంది. సర్వీస్ నంబర్ ఇవ్వగానే మీ డిస్కమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది Mana Mitra లో కరెంట్ బిల్లు చెల్లింపు UPI ద్వారా మాత్రమే చేయవచ్చు. ప్రస్తుతానికి కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లేదు. Mana Mitra లో కరెంట్ బిల్లు ఎలా కట్టాలి? WhatsApp లో 9552300009 నంబర్‌కు Hi అని పంపండి. భాష ఎంచుకోండి. ఇంగ్లిష్‌లో ఉంటే తెలుగు కోసం TE, తెలుగులో ఉంటే ఇంగ్లిష్ కోసం EN అని టైప్ చేయండి. సేవ ఎంచుకోండి (సేవ ని యెంచుకోండి). ఎనర్జీ సేవలు ఎంచుకోండి. మీ కరెంట్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయండి. Confirm (నమ్మదగిన) పై నొక్కండి. మీ సర్వీస్ నంబర్‌కు సంబంధించిన డిస్కమ్ (ఉదాహరణకు APEPDCL) సేవలు ఆటోమేటిక్‌గా చూపిస్తాయి. ఆ సేవలను ఎంచుకోండి. బిల్లు చెల్లించండి ఎంచుకుని, నిర్ధారించండి పై నొక్కండి. తర్వాత వచ్చే మెసేజ్‌లో మీ సర్వీస్ కనెక్షన్ వివరాలు, బిల్లు మొత్తం కనిపిస్తాయి. అవి మీ బిల్లు లో ఉన్న సమాచారం తో సరిపోతున్నాయో లేదో చూడండి. UPI చెల్లింపులు ఎంచుకోండి. మీ ఫోన్‌లో ఉన్న UPI యాప్‌ల జాబితా వస్తుంది. వాటిలో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయండి. చివరిగా అదే చాట్‌లో చెల్లింపు విజయవంతమైనట్లు మెసేజ్ వస్తుంది. చాట్ స్లోగా స్పందిస్తే ఏం చేయాలి? Mana Mitra లో కొన్నిసార్లు చాట్ రిప్లై ఆలస్యంగా వస్తుంది. ఏ స్టెప్ తర్వాతైనా కొద్దిసేపు మెసేజ్ రాకపోతే కొంత సమయం ఆగండి , అయినా రాకపోతే మళ్లీ Hi అని పంపి మొదటి నుంచి కొనసాగించండి. ...

ఇన్‌కమ్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ ఎలా? AP Seva Portal, MeeSeva, Mana Mitra – Income Certificate Download AP
Income Certificate అంటే ఏమిటి? ఇన్‌కమ్ సర్టిఫికెట్ (ఆదాయ ధ్రువీకరణ పత్రం) అంటే ఒక కుటుంబం లేదా వ్యక్తి సంవత్సరానికి ఎంత ఆదాయం పొందుతున్నారో రెవెన్యూ శాఖ అధికారికంగా ధృవీకరించే పత్రం. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కొన్ని ప్రభుత్వ పథకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో ఇది అడుగుతారు. ఎక్కడ ఎంత కాలం చెల్లుతుందనేది వాడే పథకం లేదా సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అవసరమైన చోట ఒకసారి అడిగి తెలుసుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికెట్ అప్లై చేశాక అది అప్రూవ్ అయిందో లేదో, ఎక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. కొందరు సచివాలయంలో అప్లై చేస్తారు, కొందరు MeeSeva లో, ఇప్పుడు WhatsApp Mana Mitra లో కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకే “AP Seva portal లో చూడాలా, MeeSeva లో చూడాలా?” అనే సందేహం వస్తుంది. ...

ఏపీకి 3 లక్షల ఇళ్లు మంజూరు: బుర్రిపాలెంలో PMAY-G 2.0 తొలి విడత, 3D ప్రింటింగ్ పైలట్ వివరాలు
అక్టోబర్ 4, ఆదివారం నాడు గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ 2.0 (PMAY-G 2.0) కింద ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షల ఇళ్లను తొలి విడతగా అందజేశారు. వీటి విలువ ₹3,600 కోట్లు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వేదికపై 3D కాంక్రీట్ ప్రింటింగ్ పద్ధతిలో 177 ఇళ్లు కట్టే పైలట్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ రెండు విషయాలు గురించి ఇక్కడ విడివిడిగా వివరంగా వివరించబడినది. ముందుగా ఒక మాట: ఇది రాష్ట్రానికి ఇళ్ల కేటాయింపు గురించిన ప్రకటన. లబ్ధిదారుల ఎంపిక, గ్రామాల వారీ జాబితా వంటివి స్థానిక అధికారుల ద్వారానే తెలుస్తాయి. 76,000 నుంచి 3 లక్షలకు కార్యక్రమంలో చెప్పిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద రాష్ట్రానికి మొదట సుమారు 76,000 ఇళ్లకే అర్హత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో దాన్ని 3 లక్షలకు పెంచారు. ...

భూమి కొలతల కాలిక్యులేటర్ (Land Calculator) – Acres to Cents or Hectare, Sq Ft to Sq Yards
భూమి కొనుగోలు, అమ్మకం, లేదా వ్యవసాయం చేసేటప్పుడు ల్యాండ్ మెజర్‌మెంట్స్ సరిగ్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఉచిత కాలిక్యులేటర్‌తో మీరు ఎకరాలు, సెంట్లు, గుంటలు, చదరపు గజాలు, చదరపు అడుగుల మరియు హెక్టార్ ల మధ్య సులభంగా కన్వర్ట్ చేయవచ్చు. పొలం ఎకరాల్లో లేద హెక్టార్ లలో చెబుతారు, ఇంటి స్థలం గజాల్లో అమ్ముతారు, ఇంటి ప్లాన్ చదరపు అడుగుల్లో ఉంటుంది. ఒకే స్థలాన్ని ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు లెక్క తప్పడం చాలా సాధారణం, ఒక్క అంకె తప్పితే ధరలో పెద్ద తేడా వస్తుంది. ఎకరాలను సెంట్లలోకి (Acres to Cents), చదరపు అడుగులను చదరపు గజాల్లోకి (Sq Ft to Sq Yards) లేదా చదరపు మీటర్లలోకి (Sq Ft to Sq Meter), ఎకరాలను హెక్టార్లోకి (Acres to Hectare) మార్చడం వంటి ఎక్కువగా అవసరమయ్యే లెక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. కాలిక్యులేటర్‌తో పాటు, ఆ లెక్కలు ఎలా వస్తాయో, కొలిచేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లు ఏమిటో, రికార్డులు చూడటానికి అధికారిక పోర్టల్స్ ఏవో కూడా ఇచ్చాం. ...

ఏపీ NSAP పింఛన్లు: అక్టోబర్ 1 నుంచి కేంద్ర వాటా బ్యాంకులో, రాష్ట్ర వాటా ఇంటి వద్ద నగదు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల చెల్లింపులో ఒక మార్పు వస్తోంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) పరిధిలోని లబ్ధిదారులకు, పింఛన్‌లోని కేంద్ర వాటా అక్టోబర్ 1 నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్ర వాటా మాత్రం ఎప్పటిలాగే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి నగదుగా ఇస్తారు. ఈ మార్పు వల్ల మొత్తం పింఛన్ తగ్గదు. క్లుప్తంగా: ఈ మార్పు NSAP పరిధిలోని సుమారు 9.34 లక్షల మంది పింఛనుదారులకు మాత్రమే. మిగతా సుమారు 53 లక్షల మంది పింఛన్ మొత్తాన్ని ఇంటి వద్ద నగదుగానే తీసుకుంటారు. కేంద్ర వాటా (₹200 నుంచి ₹500 వరకు) ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన రాష్ట్ర వాటా ఇంటి వద్ద నగదుగా అందుతుంది. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా, ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. ఈ మార్పు ఎవరికి వర్తిస్తుంది? రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద మొత్తం సుమారు 62 లక్షల మంది పింఛన్ తీసుకుంటున్నారు. వారిలో ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ పథకాల (IGNOAPS, IGNWPS, IGNDPS) కింద కేంద్ర వాటా ఉన్నవారే NSAP లబ్ధిదారులు. వారి సంఖ్య సుమారు 9.34 లక్షలు. ...

Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana: ఇంటి పైకప్పు సోలార్‌కి ₹78,000 వరకు సబ్సిడీ — పూర్తి వివరాలు
ప్రతి నెలా కరెంట్ బిల్లు చూసి బాధపడేవారు చాలామందే ఉంటారు. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే PM సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన. చాలామంది “సోలార్ పెట్టుకుందాం” అనుకున్నా, ఖర్చు, సబ్సిడీ ప్రాసెస్ గురించి సరైన క్లారిటీ లేక వెనకడుగు వేస్తుంటారు — ఆ గందరగోళాన్ని తీర్చేలా, ప్రతి పాయింట్‌ని స్పష్టంగా కింద చూద్దాం. ఇది ఏమిటి? ఇంటి పైకప్పు మీద గ్రిడ్‌కి కనెక్ట్ అయిన సోలార్ సిస్టమ్ పెట్టుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం (Central Financial Assistance) ఇచ్చే పథకం ఇది. మొత్తం ₹75,021 కోట్ల బడ్జెట్‌తో, ఒక కోటి గృహాలను లక్ష్యంగా పెట్టుకుని 2024 ఫిబ్రవరిలో ఈ పథకం మొదలైంది. ...