కరెంట్ బిల్లు కట్టడానికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఏ యాప్ లేదా వెబ్సైట్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ WhatsApp Mana Mitra ద్వారా మీ సర్వీస్ నంబర్‌తో WhatsApp లోనే బిల్లు చెల్లించవచ్చు. ఈ పోస్టులో స్టెప్ బై స్టెప్ విధానం, చెల్లింపు తర్వాత వచ్చే రసీదు మరియు SMS వివరాలు, చాట్ స్లోగా స్పందించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి.
క్లుప్తంగా
WhatsApp నంబర్: 9552300009 (అధికారిక Mana Mitra నంబర్) కావాల్సింది: మీ కరెంట్ సర్వీస్ నంబర్ మరియు UPI యాప్ Mana Mitra అన్ని డిస్కమ్‌లకు (APEPDCL, APSPDCL, APCPDCL) పనిచేస్తుంది. సర్వీస్ నంబర్ ఇవ్వగానే మీ డిస్కమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది Mana Mitra లో కరెంట్ బిల్లు చెల్లింపు UPI ద్వారా మాత్రమే చేయవచ్చు. ప్రస్తుతానికి కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లేదు. Mana Mitra లో కరెంట్ బిల్లు ఎలా కట్టాలి? WhatsApp లో 9552300009 నంబర్‌కు Hi అని పంపండి. భాష ఎంచుకోండి. ఇంగ్లిష్‌లో ఉంటే తెలుగు కోసం TE, తెలుగులో ఉంటే ఇంగ్లిష్ కోసం EN అని టైప్ చేయండి. సేవ ఎంచుకోండి (సేవ ని యెంచుకోండి). ఎనర్జీ సేవలు ఎంచుకోండి. మీ కరెంట్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయండి. Confirm (నమ్మదగిన) పై నొక్కండి. మీ సర్వీస్ నంబర్‌కు సంబంధించిన డిస్కమ్ (ఉదాహరణకు APEPDCL) సేవలు ఆటోమేటిక్‌గా చూపిస్తాయి. ఆ సేవలను ఎంచుకోండి. బిల్లు చెల్లించండి ఎంచుకుని, నిర్ధారించండి పై నొక్కండి. తర్వాత వచ్చే మెసేజ్‌లో మీ సర్వీస్ కనెక్షన్ వివరాలు, బిల్లు మొత్తం కనిపిస్తాయి. అవి మీ బిల్లు లో ఉన్న సమాచారం తో సరిపోతున్నాయో లేదో చూడండి. UPI చెల్లింపులు ఎంచుకోండి. మీ ఫోన్లో ఉన్న UPI యాప్‌ల జాబితా వస్తుంది. వాటిలో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయండి. చివరిగా అదే చాట్‌లో చెల్లింపు విజయవంతమైనట్లు మెసేజ్ వస్తుంది. చాట్ స్లోగా స్పందిస్తే ఏం చేయాలి? Mana Mitra లో కొన్నిసార్లు చాట్ రిప్లై ఆలస్యంగా వస్తుంది. ఏ స్టెప్ తర్వాతైనా కొద్దిసేపు మెసేజ్ రాకపోతే కొంత సమయం ఆగండి , అయినా రాకపోతే మళ్లీ Hi అని పంపి మొదటి నుంచి కొనసాగించండి.
...