Income Certificate అంటే ఏమిటి? ఇన్‌కమ్ సర్టిఫికెట్ (ఆదాయ ధ్రువీకరణ పత్రం) అంటే ఒక కుటుంబం లేదా వ్యక్తి సంవత్సరానికి ఎంత ఆదాయం పొందుతున్నారో రెవెన్యూ శాఖ అధికారికంగా ధృవీకరించే పత్రం. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కొన్ని ప్రభుత్వ పథకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో ఇది అడుగుతారు. ఎక్కడ ఎంత కాలం చెల్లుతుందనేది వాడే పథకం లేదా సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అవసరమైన చోట ఒకసారి అడిగి తెలుసుకోండి.

ఇన్‌కమ్ సర్టిఫికెట్ అప్లై చేశాక అది అప్రూవ్ అయిందో లేదో, ఎక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. కొందరు సచివాలయంలో అప్లై చేస్తారు, కొందరు MeeSeva లో, ఇప్పుడు WhatsApp Mana Mitra లో కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకే “AP Seva portal లో చూడాలా, MeeSeva లో చూడాలా?” అనే సందేహం వస్తుంది.

ఈ పోస్టులో AP Seva Portal, MeeSeva, WhatsApp Mana Mitra – ఈ మూడింటిలో Income Certificate ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో వివరించబడింది.

ముందు తెలుసుకోండి

  • AP Seva Portal (apseva.ap.gov.in), MeeSeva Portal (ap.meeseva.gov.in) రెండూ వేర్వేరు వెబ్‌సైట్లు.
  • రెండింటిలోనూ హోమ్ పేజీలో లాగిన్ లేకుండానే స్టేటస్ చూడటం, సర్టిఫికెట్ ప్రివ్యూ చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి.
  • లాగిన్ చేస్తే మీ పాత దరఖాస్తుల చరిత్ర (Transactions) కనిపిస్తుంది, అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • AP Seva Portal లో అయిన లేదా MeeSeva Portal అప్లై చేస్తున్నప్పుడు సరైన WhatsApp నంబర్ ఇస్తే, అప్రూవ్ అయిన సర్టిఫికెట్ ఆ నంబర్‌కే WhatsApp లో వస్తుంది.

ఏ మార్గంలో ఏం చేయవచ్చు?

మార్గంలాగిన్ లేకుండాలాగిన్‌తో
AP Seva Portal (apseva.ap.gov.in)Aadhaar ఎంటర్ చేయడం, Preview AP Seva Certificate, Service Request StatusTransactions లో History, డౌన్‌లోడ్
MeeSeva Portal (ap.meeseva.gov.in)Check Your Application Status, Preview MeeSeva Certificate, Find Your ServiceTransactions లో History, డౌన్‌లోడ్
WhatsApp Mana Mitra (9552300009)చాట్‌లోనే Reissue ద్వారా డౌన్‌లోడ్–

1. AP Seva Portal లో డౌన్‌లోడ్

AP Seva Portal హోమ్ పేజీ – Aadhaar, Preview Certificate, Service Request Status ఆప్షన్లు

AP Seva Portal హోమ్ పేజీ (apseva.ap.gov.in) లో లాగిన్ లేకుండా మూడు ఆప్షన్లు కనిపిస్తాయి:

  1. Enter your Aadhaar – Aadhaar నంబర్ ఇచ్చి, captcha ఎంటర్ చేస్తే ఆ Aadhaar తో AP Seva లో అప్లై చేసిన అన్ని ట్రాన్సాక్షన్లు కనిపిస్తాయి.
  2. Preview AP Seva Certificate – అప్రూవ్ అయిన సర్టిఫికెట్ నంబర్ ఇచ్చి, captcha ఎంటర్ చేస్తే సర్టిఫికెట్ ప్రివ్యూ వస్తుంది.
  3. Service Request Status – అప్లికేషన్ ID ఇచ్చి, captcha ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.
  1. apseva.ap.gov.in హోమ్ పేజీ తెరవండి.
  2. మీ దగ్గర అప్లికేషన్ ID ఉంటే Service Request Status ఎంచుకుని, ID, captcha ఇచ్చి స్టేటస్ చూడండి.
  3. సర్టిఫికెట్ నంబర్ ఉంటే Preview AP Seva Certificate లో ఆ నంబర్ ఇచ్చి సర్టిఫికెట్ చూడండి.
  4. రెండూ లేకపోతే Enter your Aadhaar ద్వారా మీ ట్రాన్సాక్షన్లు వెతకండి.
  5. లేదా Citizen Login చేసి, Transactions లో మీ అప్లికేషన్ ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోండి.

2. MeeSeva Portal లో డౌన్‌లోడ్

MeeSeva Portal హోమ్ పేజీ – Check Your Application Status, Preview MeeSeva Certificate, Find Your Service ఆప్షన్లు

MeeSeva హోమ్ పేజీ (ap.meeseva.gov.in) లో కూడా లాగిన్ లేకుండా మూడు ఆప్షన్లు ఉన్నాయి:

  1. Check Your Application Status
  2. Preview MeeSeva Certificate
  3. Find Your Service

లాగిన్ అయితే ఇక్కడా మీ ట్రాన్సాక్షన్ల చరిత్ర కనిపిస్తుంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గమనిక: MeeSeva Citizen Login లో అప్లై చేసి డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ ఉంది, కానీ అందులో ప్రస్తుతం Agriculture Income Certificate మాత్రమే కనిపిస్తోంది. సాధారణ Income Certificate కోసం AP Seva Portal లేదా సచివాలయం ద్వారా వెళ్లడం మంచిది.

అయితే ఒక పోర్టల్‌లో అప్లై చేసిన సర్టిఫికెట్ మరో పోర్టల్‌లో కనిపిస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము. అందుకే మీరు ఏ పోర్టల్‌లో అప్లై చేశారో, ముందు అక్కడే వెతకండి.

3. WhatsApp Mana Mitra ద్వారా డౌన్‌లోడ్ (Reissue)

ఇన్‌కమ్ సర్టిఫికెట్ పోయినా లేదా మళ్లీ కాపీ కావాలన్నా Mana Mitra లో Reissue ఆప్షన్ ద్వారా పొందవచ్చు. కొత్త ఆదేశాల ప్రకారం ఈ సేవ ఇకపై Mana Mitra లోనే అందుతుంది.

  1. WhatsApp లో 9552300009 నంబర్‌కు Hi అని పంపండి.
  2. మెనూలో Revenue Department ఎంచుకోండి.
  3. Reissuance of Income Certificate ఎంచుకోండి.
  4. Aadhaar ఆప్షన్ ద్వారా మీ వివరాలను ధృవీకరించండి (verify).
  5. చూపించే demographic వివరాలు (పేరు, చిరునామా వంటివి) సరిగా ఉన్నాయో చూడండి.
  6. Preview లో సర్టిఫికెట్ చూసి, ఆ తర్వాత Download చేసుకోండి.

Online లో అప్లై చేసినవారికి ఒక చిట్కా

Online లో అప్లై చేసేటప్పుడు మీ సరైన WhatsApp నంబర్ ఇవ్వండి. సర్టిఫికెట్ అప్రూవ్ అయ్యాక అది ఆ నంబర్‌కే WhatsApp లో వస్తుంది. అదే నంబర్‌తో తర్వాత Mana Mitra ద్వారా Reissue కూడా చేసుకోవచ్చు. తప్పు నంబర్ ఇస్తే ఈ సౌకర్యం మీకు అందదు.

డౌన్‌లోడ్ తర్వాత జాగ్రత్తలు

  • పోర్టల్ URL సరిగా ఉందో లేదో చూసుకోండి: apseva.ap.gov.in మరియు ap.meeseva.gov.in. ఇలాంటి పేర్లతో వచ్చే ఇతర సైట్లలో Aadhaar నంబర్ ఇవ్వవద్దు.
  • OTP, UPI PIN ఎవరికీ చెప్పవద్దు.
  • సర్టిఫికెట్‌లో పేరు, చిరునామా, ఆదాయ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి.
  • సర్టిఫికెట్ ఉన్న QR కోడ్ స్కాన్ చేసి, వివరాలు అధికారిక సైట్‌లో కనిపిస్తున్నాయో లేదో చూడండి.
  • WhatsApp లో సేవల కోసం 9552300009 అధికారిక నంబర్ మాత్రమే వాడండి.

తరచూ వచ్చే సందేహాలు

Income Certificate PDF ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

పైన చెప్పిన AP Seva Portal, MeeSeva లేదా Mana Mitra లో ఏదో ఒకదాని ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ పోర్టల్‌లో అప్లై చేశారో అక్కడ వెతకడం సులభం.

అప్లికేషన్ ID లేదా సర్టిఫికెట్ నంబర్ మర్చిపోతే?

AP Seva Portal లో Aadhaar నంబర్ ద్వారా మీ ట్రాన్సాక్షన్లు వెతకవచ్చు, లేదా Citizen Login చేసి Transactions చూడవచ్చు. MeeSeva లో కూడా లాగిన్ చేస్తే చరిత్ర కనిపిస్తుంది. సర్టిఫికెట్ పూర్తిగా పోతే Mana Mitra లో Reissue ఎంచుకోండి.

ఇది తెలంగాణకు కూడా వర్తిస్తుందా?

లేదు. ఈ పోస్టు ఆంధ్రప్రదేశ్ పోర్టల్స్ కోసం మాత్రమే. తెలంగాణకు ts.meeseva.gov.in వేరే వ్యవస్థ.

Income Certificate, Integrated Certificate ఒకటేనా?

కాదు. రెండూ వేర్వేరు సేవలు. రెండింటికీ Mana Mitra లో Reissue ఆప్షన్ ఉంది.


గమనిక: ఈ వ్యాసం పోర్టల్స్‌లో చూసిన వివరాల ఆధారంగా, సమాచారం కోసం మాత్రమే వ్రాయబడింది. ఇది అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ కాదు. పోర్టల్ ఆప్షన్లు, నియమాలు మారవచ్చు. తుది వివరాల కోసం అధికారిక పోర్టల్స్ లేదా సచివాలయాన్ని సంప్రదించండి.

చివరిసారి సమీక్షించింది: 8 అక్టోబర్ 2026