కరెంట్ బిల్లు కట్టడానికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఏ యాప్ లేదా వెబ్‌సైట్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ WhatsApp Mana Mitra ద్వారా మీ సర్వీస్ నంబర్‌తో WhatsApp లోనే బిల్లు చెల్లించవచ్చు. ఈ పోస్టులో స్టెప్ బై స్టెప్ విధానం, చెల్లింపు తర్వాత వచ్చే రసీదు మరియు SMS వివరాలు, చాట్ స్లోగా స్పందించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి.
క్లుప్తంగా
- WhatsApp నంబర్: 9552300009 (అధికారిక Mana Mitra నంబర్)
- కావాల్సింది: మీ కరెంట్ సర్వీస్ నంబర్ మరియు UPI యాప్
- Mana Mitra అన్ని డిస్కమ్‌లకు (APEPDCL, APSPDCL, APCPDCL) పనిచేస్తుంది. సర్వీస్ నంబర్ ఇవ్వగానే మీ డిస్కమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది
- Mana Mitra లో కరెంట్ బిల్లు చెల్లింపు UPI ద్వారా మాత్రమే చేయవచ్చు. ప్రస్తుతానికి కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లేదు.
Mana Mitra లో కరెంట్ బిల్లు ఎలా కట్టాలి?
- WhatsApp లో 9552300009 నంబర్‌కు Hi అని పంపండి.
- భాష ఎంచుకోండి. ఇంగ్లిష్‌లో ఉంటే తెలుగు కోసం TE, తెలుగులో ఉంటే ఇంగ్లిష్ కోసం EN అని టైప్ చేయండి.
- సేవ ఎంచుకోండి (సేవ ని యెంచుకోండి).
- ఎనర్జీ సేవలు ఎంచుకోండి.
- మీ కరెంట్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయండి.
- Confirm (నమ్మదగిన) పై నొక్కండి.
- మీ సర్వీస్ నంబర్‌కు సంబంధించిన డిస్కమ్ (ఉదాహరణకు APEPDCL) సేవలు ఆటోమేటిక్‌గా చూపిస్తాయి. ఆ సేవలను ఎంచుకోండి.
- బిల్లు చెల్లించండి ఎంచుకుని, నిర్ధారించండి పై నొక్కండి.
- తర్వాత వచ్చే మెసేజ్‌లో మీ సర్వీస్ కనెక్షన్ వివరాలు, బిల్లు మొత్తం కనిపిస్తాయి. అవి మీ బిల్లు లో ఉన్న సమాచారం తో సరిపోతున్నాయో లేదో చూడండి.
- UPI చెల్లింపులు ఎంచుకోండి.
- మీ ఫోన్‌లో ఉన్న UPI యాప్‌ల జాబితా వస్తుంది. వాటిలో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయండి.
- చివరిగా అదే చాట్‌లో చెల్లింపు విజయవంతమైనట్లు మెసేజ్ వస్తుంది.
చాట్ స్లోగా స్పందిస్తే ఏం చేయాలి?
Mana Mitra లో కొన్నిసార్లు చాట్ రిప్లై ఆలస్యంగా వస్తుంది. ఏ స్టెప్ తర్వాతైనా కొద్దిసేపు మెసేజ్ రాకపోతే కొంత సమయం ఆగండి , అయినా రాకపోతే మళ్లీ Hi అని పంపి మొదటి నుంచి కొనసాగించండి.
- రిప్లై రాలేదని కంగారుపడి ఒకే చెల్లింపు ఆప్షన్‌ను మళ్లీ మళ్లీ నొక్కవద్దు.
- UPI చెల్లింపు చేసిన తర్వాత చాట్‌లో రిప్లై రాకపోతే, మళ్లీ చెల్లించే ముందు మీ UPI యాప్‌లో ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడండి. డబ్బు కట్ అయి ఉంటే మళ్లీ చెల్లించవద్దు.
- Hi అని మళ్లీ పంపితే ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి మొదలవుతుంది.
చెల్లింపు తర్వాత రుజువు ఏం వస్తుంది?
| ఏమి | ఎక్కడ | ఎప్పుడు |
|---|---|---|
| చెల్లింపు విజయవంతమైన మెసేజ్ (రసీదు నంబర్, చెల్లించిన తేదీతో) | Mana Mitra చాట్‌లో | చెల్లింపు తర్వాత |
| “బిల్లు చెల్లించారు” SMS | కరెంట్ కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు | సుమారు 15 నిమిషాల తర్వాత వచ్చింది |
| UPI ట్రాన్సాక్షన్ రికార్డు | మీరు వాడిన UPI యాప్‌లో | వెంటనే |
- SMS కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన నంబర్‌కు వస్తుంది. మీరు చెల్లించిన ఫోన్ వేరే నంబర్ అయితే, SMS ఆ ఫోన్‌కు రాకపోవచ్చు.
- చాట్‌లోని మెసేజ్‌లు మీ WhatsApp చాట్ హిస్టరీలోనే ఉంటాయి. వెనక్కి స్క్రోల్ చేసి మళ్లీ చూడవచ్చు. ప్రత్యేకంగా “payment history” అనే లేదు.
- చెల్లింపు తర్వాత చాట్‌లో వచ్చే మెసేజ్‌లో రసీదు నంబర్, చెల్లించిన తేదీ ఉంటాయి. ప్రత్యేకంగా PDF రసీదు డౌన్‌లోడ్ ఆప్షన్ లేదు, కాబట్టి ఆ మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి భద్రపరచుకోండి.
చెల్లింపులో సమస్య వస్తే
- ముందుగా మీ UPI యాప్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో డబ్బు కట్ అయిందో లేదో చూడండి.
- డబ్బు కట్ అయి, చాట్‌లో విజయవంతమైన మెసేజ్ రాకపోతే వెంటనే మళ్లీ చెల్లించవద్దు. కొద్దిసేపు వేచి చూడండి, SMS కోసం చూడండి.
- ఇంకా సమస్య ఉంటే UPI ట్రాన్సాక్షన్ ID, తేదీ, సర్వీస్ నంబర్‌తో మీ డిస్కమ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
- రీఫండ్ వివరాలు బ్యాంక్ మరియు డిస్కమ్ నియమాలపై ఆధారపడి ఉంటుంది.
జాగ్రత్తలు
- Mana Mitra కోసం 9552300009 అధికారిక నంబర్ మాత్రమే వాడండి. ఇతర నంబర్లు, లింకులు పంపేవారిని నమ్మవద్దు.
- చెల్లించే ముందు మీ సర్వీస్ నంబర్, బిల్లు మొత్తం సరిగా ఉన్నాయో చూసుకోండి.
- UPI PIN, OTP ఎవరికీ చెప్పవద్దు. Mana Mitra చాట్‌లో కూడా PIN అడగదు. UPI యాప్‌లోనే ఎంటర్ చేయాలి.
- స్క్రీన్‌షాట్లు ఇతరులకు పంపేటప్పుడు సర్వీస్ నంబర్, పేరు, చిరునామా దాచండి.
తరచూ వచ్చే సందేహాలు
Mana Mitra లో కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌తో కరెంట్ బిల్లు కట్టవచ్చా?
ప్రస్తుతం Mana Mitra లో కరెంట్ బిల్లు చెల్లింపు UPI ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌తో చెల్లించాలంటే మీ డిస్కమ్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ వాడండి.
ఏ డిస్కమ్‌లకు ఈ సదుపాయం ఉంది?
Mana Mitra ద్వారా APEPDCL, APSPDCL, APCPDCL – ఈ మూడు డిస్కమ్‌ల బిల్లులు చెల్లించవచ్చు. మీ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు మీ డిస్కమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది, ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు.
చెల్లించాక SMS రాకపోతే?
కొచెల్లింపు తర్వాత SMS రావడానికి కొంత సమయం పట్టవచ్చు, కాబట్టి కొద్దిసేపు వేచి చూడండి. ఈ SMS విద్యుత్ కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కే వస్తుంది, మీరు చెల్లించిన ఫోన్‌కు రాకపోవచ్చు. అయినా రాకపోతే UPI ట్రాన్సాక్షన్ వివరాలు, సర్వీస్ నంబర్‌తో మీ డిస్కమ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
చాట్ రిప్లై రాకపోతే ఏం చేయాలి?
కొద్దిసేపు ఆగి, అయినా రాకపోతే మళ్లీ Hi అని పంపండి. చెల్లింపు చేశాక రిప్లై రాకపోతే, ముందు UPI యాప్‌లో ట్రాన్సాక్షన్ చూసి, ఆ తర్వాతే మళ్లీ చెల్లించడం గురించి ఆలోచించండి.
ఇలాంటి అప్డేట్స్ కోసం
ప్రభుత్వ పథకాలు, GOలు, అప్డేట్స్ సరళమైన తెలుగులో
గమనిక: ఇది సమాచారం కోసం మాత్రమే, అధికారిక ప్రభుత్వ లేదా డిస్కమ్ వెబ్‌సైట్ కాదు. వివరాలు మారవచ్చు, తుది సమాచారం కోసం అధికారిక వనరులను సంప్రదించండి.
చివరిసారి సమీక్షించింది: 9 అక్టోబర్ 2026
